క్రీడలతో మానసికోల్లాసం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:31 AM
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి మాధవరావు అన్నారు.
నందవరం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి మాధవరావు అన్నారు. నందవరంలో హరే శ్రీనివాస యూత్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం దేశాయి కబడ్డీ ఆడి పోటీలను ప్రారంభించారు. గెలిచిన జట్లకు మొదటి బహుమతి రూ. 10,016, రెండో బహుమతి రూ. 5,016, మూడో బహుమతి రూ.3,016 దేశాయి మాధవరావు నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్ర మంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు లచ్చప్పనాయుడు, వెంకటేశ్వర్లు, బెస్త ఈరన్న, శ్రీనివాసులు, మల్లికార్జున పాల్గొన్నారు.