Share News

‘పునరావాసం కల్పించాలి’

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:57 AM

సోలార్‌ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం కల్పించాలని టీడీపీ నాయకులు మురళీమోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌ కోరారు.

‘పునరావాసం కల్పించాలి’
ఎమ్మెల్యేకు సమస్యలు వివరిస్తున్న టీడీపీ నాయకులు

గడివేముల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సోలార్‌ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం కల్పించాలని టీడీపీ నాయకులు మురళీమోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌ కోరారు. శుక్రవారం కర్నూలులోని గౌరు నివాసంలో ఎమ్మెల్యే చరితను కలిశారు. గని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం పునరావాసంపై దృష్టి పెట్టకపోవడంతో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. గని చెరువులో చేపలు పట్టుకునేందుకు కొత్త వారికి సభ్యత్వం చేసుకు నేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో గని గ్రామ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:57 AM