వైభవంగా రథసప్తమి
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:03 AM
నంద్యాల సంజీవనగర్ కోదండరామాలయంలో వెలసిన వేంకటేశ్వరస్వామి ప్రాంగణంలో మంగళవారం వైభవంగా రధసప్తమి వేడుక లు నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): నంద్యాల సంజీవనగర్ కోదండరామాలయంలో వెలసిన వేంకటేశ్వరస్వామి ప్రాంగణంలో మంగళవారం వైభవంగా రధసప్తమి వేడుక లు నిర్వహించారు. ఉదయం గణపతిపూజతో ప్రారంభించి అష్టదళపాద పద్మారాధన సేవ , సూర్య ఆరాధనలు, సూర్య నమస్కారాలు, కార్యసిద్ధి గణపతి హోమం, దశభుజ గణపతి హోమం, ధన్వంతరీ హోమం, సుదర్శన హోమం, అరుణహోమం,ఇత్యాది హోమాల అనంతరం పూర్ణా హుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహా మంగళ హారతి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భగవత్ సేవా సమాజ్ కమిటీ అఽధ్యక్షుడు సముద్రాల సూరయ్య, శ్రీనివాస్, పార్థసారధికృష్ణ, వంకదారి మధుసూదన్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భద్రావతీ భావనా బుషి ఆలయంలో రధసప్తమీ సందర్భంగా భద్రావతి, భావనా ఋషి స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.
నంద్యాల ఎడ్యుకేషన్: సూర్యని నుంచి వెలువడే కిరణాలు సకల చరాచర జగత్తుకు శక్తిని ప్రసాదిస్తుందని శ్రీరామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి వివరించారు. రఽథసప్తమి సందర్భంగా నంద్యాల శ్రీ శాంతినికేతన్ పాఠశాలలో నిర్వాహకుడు సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు.
ఆత్మకూరు: సూర్యభగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆత్మకూరులోని భూరాహ శ్రీదేవి భూదేవి సహిత వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సం అత్యంత వైభవోపేతంగా కొనసాగింది. ముందుగా ఆలయంలోని వేంకటేశ్వరస్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, ఆరాధన కార్యక్రమాలను శాస్రోక్తంగా జరిపారు. మధ్యాహ్న సమయంలో రథంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో పాటు సూర్యభగవానుడి చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి అశ్వరథ కార్యక్రమాన్ని జరిపారు. సూర్య భగవానుడికి విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, ద్వాదశ ఆరాధన, మహాసౌరమంత్రపఠనం, సూర్యాష్టం వంటి తదితర పూజా కార్యక్ర మాలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు దేవరపల్లి అనిల్‌కుమార్ రథసప్తమి విశిష్టత గురించి వివరించారు. రథోత్సవంలో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రామయ్య తదితరులు ఉన్నారు.
పాణ్యం: మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. శివాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో రామకృష్ణ, సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, ఎంపీటీసీ భాస్కరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రమణమూర్తి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, టీడీపీ నాయకులు మిలిటరీ సుబ్బారెడ్డి, రామ్మోహన్‌నాయుడు, నంద్యాల రవి, సురేష్, శివశంకరరెడ్డి, దానం, అర్చకులు వీరయ్య స్వామి, నారాయణస్వామి, సురేష్‌శర్మ, రోహిత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరులోని ఛాయా ఉషా సమేత సూర్యనారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం తెల్లవారు ఝామునుంచే భక్తులు ఆ సూర్య భగవానున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు రవి, బాలయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు శాలువాతో సన్మానించారు. అనంతరం ఛాయా ఉషా సమేత సూర్యనారాయణస్వామి వారి కల్యాణం కన్నుల విందుగా జరిగింది. ఎమ్మెల్యే వెంట టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, ముర్తుజావళి, లాయర్ జాకీర్, వేణుగోపాల్, తదితరులు ఉన్నారు.