నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: మంత్రి బీసీ
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:49 AM
జాతీయ రహదారి నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.

పాణ్యం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న హైవే పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు.