రాష్ట్రంలో ప్రజా పాలన: మంత్రి
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:29 AM
రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గీవెన్స్ సెల్ నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన పలువురి నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. ముఖ్యమైన వినతులపై వెంటనే స్పందించి సంబం ధిత అధికారులకు వేదిక మీద నుంచే ఫోన్‌లో ఆదేశాలిచ్చారు. తనకు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సహకరిస్తే నంద్యాల పట్టణాన్ని కేవలం 6 నెలలలో పరిశుభ్రంగా తయారు చేస్తానని బాబు అనే వ్యక్తి మంత్రికి వినతి పత్రం ఇచ్చా రు. కమిషర్‌కు చెబుతానని మంత్రి హామీ ఇచ్చారు. నాయ కులు మునగాల విశ్వనాథరెడ్డి, పుసులూరు మాజీ సర్పంచ్ పుల్లయ్య పాల్గొన్నారు.
‘అర్హులకు రుణాలు ఇవ్వండి’
నంద్యాల కల్చరల్/మున్సిపాలిటీ: అర్హులైన బీసీలందరికీ రుణాలు ఇవ్వాలని న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుసేన్‌ను ఆదేశించారు. ఈడీ శనివారం మంత్రిని నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ కానున్న రుణాల గురించి ఈడీ మంత్రికి వివరించారు.