పోస్టరు ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:32 AM
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదిన చేపట్టబోతున్న ప్రజా ఉద్యమ పోస్టర్‌ను శుక్రవారం పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుట్టా రేణుక విడుదల చేశారు.
ఎమ్మిగనూరు టౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదిన చేపట్టబోతున్న ప్రజా ఉద్యమ పోస్టర్‌ను శుక్రవారం పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుట్టా రేణుక విడుదల చేశారు. ఆమెతో పాటు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రైవేట వ్యక్తులకు అప్పగించే దిశగా వ్యవహరించడం చాలా దారుణమన్నారు. ఈ ధర్నాలో ప్రజలను, విద్యార్థి సంఘాలను భాగం చేస్తూ ధర్నా చేయబోతున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల, ఆసుపత్రులు ప్రజల ఆస్తి, ప్రజల హక్కు వాటిని ప్రైవేటీకరణ చేసి, మున్ముందు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటికరకణ చేసిన ఆశ్చర్యపోనకర్లేదని అన్నారు. ప్రజలకు అందించాల్సిన కనీస సౌకర్యాలను, అవసరాలను కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిది అని అన్నారు. మహిళలకు ఎలక్షన్‌కు ముందు ఇచ్చిన హామిలో భాగంగా స్త్రీ నీధిని దానిని కూడా పీ4లో భాగం అని చెప్పడం స్త్రీలను మోసం చేయడమేనన్నారు. ప్రజలోకి వెళ్లి అవగాహన కల్పిస్తూ కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, బసిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్, నరసింహులు, విరుపాక్షిరెడ్డి, లతారెడ్డి పాల్గొన్నారు.