గోశాల అభివృద్ధికి ప్రణాళిక: ఈవో
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:21 AM
మహానందిలోని దేవస్థానం గోశాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మహానంది, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మహానందిలోని దేవస్థానం గోశాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం క్షేత్ర పరిధిలోని గోశాలను ఆయన సందర్శించారు. ఈవో మాట్లాడుతూ అడవికి అత్యంత సమీపంలో ఉండటంతో గోవులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రక్షణ చర్యల్లో భాగంగా ముందుగా గోశాల చుట్టూ ఆరు అడుగుల ఎత్తులో ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటుకు పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఈవో ఆదేశించారు. గోవులు అడవి జంతువుల బారిన పడకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోశాల నుంచి మురుగు వెళ్లేందుకు సైడ్ కాలువలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని సిబ్బందికి సూచించారు. ఏఈవో ఎర్రమల్ల మధు, ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు, అర్చకుడు సుబ్బయ్యశర్మ ఉన్నారు.