మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:23 AM
ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.

నంద్యాల ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. పట్టణంలోని బొమ్మలసత్రంలోని సమీ కృత బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. పదో తరగతి విద్యార్థినులకు పరీక్షల నేపథ్యంలో విద్యా సామగ్రిని అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పట్టుదలతో చదవాలని సూచించారు.