Share News

పెచ్చెరువు గూడెంలో అధికారుల పర్యటన

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:01 AM

నల్లమలలోని పెచ్చెరువు గూడేన్ని అధికారులు మంగళవారం సందర్శించారు. డీఎల్‌డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంపీడీవో సుబ్ర హ్మణ్యం, ఈవోఆర్డీ బాలునాయక్‌ అధికార యంత్రాంగంతో కలిసి పెచ్చె రువు గూడెంలో గ్రామ సభను ఏర్పాటు చేసి అక్కడి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.

పెచ్చెరువు గూడెంలో అధికారుల పర్యటన
సమస్యలు తెలుసుకుంటున్న అధికారులు

ఆత్మకూరు రూరల్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): నల్లమలలోని పెచ్చెరువు గూడేన్ని అధికారులు మంగళవారం సందర్శించారు. డీఎల్‌డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంపీడీవో సుబ్ర హ్మణ్యం, ఈవోఆర్డీ బాలునాయక్‌ అధికార యంత్రాంగంతో కలిసి పెచ్చె రువు గూడెంలో గ్రామ సభను ఏర్పాటు చేసి అక్కడి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను సంద ర్శించి అక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. శ్రీశైల పాద యాత్రికులకు ఏలోటు రానివ్వకుండా చూస్తామని డీఎల్‌డీవో తెలిపారు. లక్షలాదిగా తరలి వచ్చే పాదయాత్రికులకు మౌళిక సదుపా యాలను కల్పించేం దుకు గూడెంలో అధికారులతో కలిసి పర్యటించి తాగునీటి సదుపాయా లను పర్యవేక్షించారు. భక్తులకు తాగునీటి ఇబ్బం దులు తలెత్తకుండా ముందస్తుగా అక్కడి బోర్లకు మరమ్మతులు చేయిం చారు. ఏవో ఉమ్మర్‌, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 01:01 AM