ఘనంగా మాతృభాషా దినోత్సవం
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:28 AM
నంద్యాల మున్సిపల్ హైస్కూల్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నంద్యాల మున్సిపల్ హైస్కూల్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. మనిషిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడుగా మార్చగలిగే శక్తి ఒక్క మాతృభాషకు మాత్రమే ఉందని, అలాంటి మాతృభాష మనుగడ కోసం నేడు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి అన్నారు. దంత వైద్యుడు డా.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తెనెలొలుకు భాష మన తెలుగు భాష, ఇంత కమ్మనైన మన అమ్మభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైనా ఉందన్నారు. నేటి విద్యార్ధులల్లో పుస్తక పఠనం లేకపోవడం వల్ల వారు మాతృభాషకు దూరమవుతున్నారు. పద్యపఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రచయితలు డా. నీలం వెంకటేశ్వర్లు, సాహితీ స్రవంతి సభ్యులు రామచంద్రమూర్తి, నీలకంఠమాచారి, రఫి, ఉపాధ్యాయులు రహంతున్నీసా, భారతి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల రూరల్: మాతృభాష మధురం.. అభ్యసనే అందరి లక్ష్యం అని ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమళ్ల రహీం అన్నారు. శుక్రవారం పట్టణం ముల్లాన్‌పేట మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.