Share News

‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు’

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:22 AM

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పేర్కొన్నారు.

‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు’
సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆదోని డివిజన్‌ స్థాయి రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గరిష్ఠ వేగపరిమితిని అమలు చేయాలని, అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమా నాలు విధించాలన్నారు. ప్రమాదకరమైన మలుపులు, స్కూల్‌ జోన్‌లు, రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో హెచ్చరికల బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు క్వాలిటీని మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు గుంతలను సరిచేయాలని చెప్పారు. డీఎస్పీలు హేమలత, ఆఈర్టలో నాగేంద్ర, మోటర్‌ వెహికల్‌ ఇనెస్పెక్టర్‌ శిశిర దీప్తి, ఉపేంద్ర, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఇంజనీర్‌ వెంకటేశ్వరులు, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:22 AM