పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:14 AM
ఆదోని పట్టణంలో ఈనెల 18,19వ తేదీల్లో చేపట్టే పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి రాజీవ్ కోరారు.
ఎమ్మిగనూరు రూరల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణంలో ఈనెల 18,19వ తేదీల్లో చేపట్టే పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి రాజీవ్ కోరారు. ఆదివారం రాష్ట్ర సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఎమ్మిగనూరులో విడుదల చేశారు. వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజీ విరుపాక్షి, రైతులు పాల్గొన్నారు.
నందవరం: ప్రభుత్వం నష్టపోయిన పత్తి రైతులను ఉద్దేశించి వెంటనే సీసీఐ ద్వారా నేరుగా రూ.12 వేలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడు డిమాండ్ చేశారు. ఆదివారం నందవరంలో ఆయన సీపీఐ అధ్యక్షుడు గిడ్డయ్య ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ నెల 18, 19 తేదీన చలో ఆదోనిలో జరిగే సమ్మేళనానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. నాగరాజు, నరసింహులు, దేవరాజు, బసవరాజు పాల్గొన్నారు.