Share News

మహానందిలో న్యాయాధికారి పూజలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:23 AM

మహానంది క్షేత్రంలో శుక్రవారం నంద్యాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధారాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానందిలో న్యాయాధికారి పూజలు
న్యాయాధికారి రాధారాణి దంపతులను ఆశీర్వదిస్తున్న వేదపండితులు

మహానంది, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శుక్రవారం నంద్యాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధారాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం ముఖద్వా రం వద్ద అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో న్యాయాధికారి దంపతులు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించారు. కల్యా ణ మంటపంలో వీరిని వేదపండితులు శాలువాతో సన్మానించి ఆశీర్వదిం చారు. స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ పర్య వేక్షకుడు శశిధర్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు(చిన్నా) ఉన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 01:23 AM