Share News

‘గ్రామకంఠం భూమిని కాపాడాలి’

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:16 AM

మండలంలోని గుడికల్‌లో ఉన్న 1.80 ఎకరాల గ్రామకంఠకం భూమిని కాపాడాలని కోరుతూ గుడికల్‌ గ్రామానికి చెందిన పలువురు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

‘గ్రామకంఠం భూమిని కాపాడాలి’
ధర్నా చేస్తున్న గుడికల్‌ వాసులు

ఎమ్మిగనూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడికల్‌లో ఉన్న 1.80 ఎకరాల గ్రామకంఠకం భూమిని కాపాడాలని కోరుతూ గుడికల్‌ గ్రామానికి చెందిన పలువురు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన మెనుకబడిన, నిరుపేదకుటుంబాలు స్థానికంగా జీవిస్తున్నామని, ఇళ్లస్థలాలు లేనివారికి ఆ స్థలాన్ని ఇవ్వాలని కోరారు. ఇటీవల కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఇది జరిగితే ఇళ్లస్థలాలు లేని వారంతా ఇబ్బందులకు గురువుతామని అన్నారు. అధికారులు పరిశీలించి గ్రామకంఠకం భూమిని కాపాడటంతో పాటు నిరుపేదలైన మాకు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం వినతి పత్రాన్ని డీటీకి అందజేశారు. డీటీ, వీఆర్వో, వీఆర్‌ఏలు గుడికల్‌ గ్రామానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Nov 16 , 2025 | 12:16 AM