లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించాలి: కలెక్టర్
ABN , Publish Date - Feb 20 , 2025 | 01:08 AM
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న 12 లక్షల వేతనదారుల లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లె, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న 12 లక్షల వేతనదారుల లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పథకంలో వేతనదారులకు పనులు కల్పించి లక్ష్యాలను మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీడీలు క్షేత్రస్థాయిలో తిరిగి సంబంధిత ఫొటోలను ఆప్‌లోడ్ చేయాలన్నారు. వెలుగోడు, ఆత్మకూరు, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాల్లో మాస్టర్ రిజిష్టర్‌లో రిపోర్టెడ్ వర్సెస్ జనరెక్టెడ్ అయిన వ్యత్యాసాలను విశ్లేషించి నివేదికలు అందజేయాలన్నారు. ఇంకా ప్రారంభించని 127 పశువుల షెడ్లను ప్రారంభించేందుకు పశు వైద్యులను సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి పది ఫారం పాండ్స్ చొప్పున 489గ్రామ పంచాయతీలకు ఫార్మ్‌ఫాండ్స్ ప్రతిపాదన లు ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 29వేల ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సర్వేను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను, ఎంపీడీవోలను ఆదేశించారు. సమావేశంలో డ్వామా ఇన్‌చార్జి పీడీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
సున్నా పేదరికమే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందితో పీ-4 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పీ-4సర్వే ప్రక్రియపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో సీపీవో వేణుగోపాల్, డీఎల్‌డీఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.