వైభవంగా కల్యాణం, రథోత్సవం
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:25 AM
రోళ్లపాడు ఆభయారణ్యంలో వెలిసిన బరక సంజీవరాయుడి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సంజీవరాయ స్వామితో పాటు సీతారాముల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

మిడుతూరు, ఫిబ్రవరి 7( ఆంధ్రజ్యోతి): రోళ్లపాడు ఆభయారణ్యంలో వెలిసిన బరక సంజీవరాయుడి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సంజీవరాయ స్వామితో పాటు సీతారాముల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పట్టు వస్రాలతో అలంకరించి పూలతో అలంకరించి రథంపైన విగ్రహాలను అధిష్టించి రథాన్ని ఆలయం ఆవరణలో ప్రదక్షిణలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో ధర్మకర్త పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి, కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం కలశస్థాపనం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీనామనామ స్మరణల నడుమ శాస్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ ఓబులేసు, పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టారు.