Share News

జూడో జట్ల ఎంపిక పోటీలు

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:08 AM

పట్టణంలోని పద్మావతినగర్‌లో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా జూడో జూనియర్‌ కేడెట్‌ బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి.

 జూడో జట్ల ఎంపిక పోటీలు
పోటీలను ప్రారంభిస్తున్న డీఎస్‌డీవో ఎంఎన్‌వీ రాజు

నంద్యాల హాస్పిటల్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పద్మావతినగర్‌లో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా జూడో జూనియర్‌ కేడెట్‌ బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా జూడో అసోసియేషన్‌ చైర్మన్‌ నిమ్మకాయల సుధాకర్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎంఎన్‌వీ రాజు ప్రారంభించారు. చైర్మన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఈ నెల 19నుంచి 21వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి జూడో జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ పోటీల్లో పతకాలు సాధించి నంద్యాల జిల్లాకు పేరుతీసుకురావాలని, క్రీడలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఏపీ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీరెడ్డి, జిల్లా కార్యదర్శి దండెనాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు సురేశ్‌ నాయుడు, సుధాకర్‌, మహబూబ్‌బాషా, జూడో శిక్షకుడు శాంతరాజు, మహిళా వ్యాయామ ఉపాధ్యాయులు షహనాజ్‌, ఊర్మిల, నజీమ, కవిత, జిల్లా నలు మూలల నుంచి దాదాపు 150 మంది బాల, బాలికలు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:08 AM