కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇవ్వాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:31 PM
ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ మరణించిన, పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని వారికే ఉద్యోగాలు ఇవ్వాని ఏఐటీయూసీ నాయకులు యల్లప్ప, విజయేంద్ర, నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు రూరల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ మరణించిన, పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని వారికే ఉద్యోగాలు ఇవ్వాని ఏఐటీయూసీ నాయకులు యల్లప్ప, విజయేంద్ర, నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మిక సంఘం యూనియన్ నాయకులు శివ, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగులకు 12శాతం పీఆర్‌సీని ప్రకటించి 30శాతం మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. పట్టణ విస్తిర్ణాన్ని బట్టి కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఖాజా, నరసింహులు, భీముడు, వీరేష్, నరేష్, యోహాన్‌లు పాల్గొన్నారు.