‘ఉద్యోగావకాశాలు కల్పించాలి’
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:22 AM
ఉద్యోగావకాశాలు తమకు కల్పించాలని మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కోరారు.
ఎమ్మిగనూరు టౌన్/రూరల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉద్యోగావకాశాలు తమకు కల్పించాలని మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కోరారు. పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో 4వ రోజు గురువారం రోడ్లను శుభ్రం చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం నుంచి కార్మికులతో ర్యాలీ చేపట్టి సోమప్ప సర్కిల్‌లొ రోడ్లను శుభ్రం చేస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు చనిపొయినప్పటి నుంచి వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మొన్నటి రోజున ఉద్యోగాలు ఇస్తామని హడావుడి చేసిన కమిషనర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కార్మికుల శ్రమను దోచుకొని తీరా వారు మరణించిన తర్వాత వారి కటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి ఖాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు వీరేశ్‌యాదవ్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎల్లప్ప, శివ, ప్రతాప్, విజయేంద్ర, భీమన్న తదితరులు పాల్గొన్నారు.