Share News

ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:21 AM

ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్‌లో పని చేసిన వారికి స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని ఎమ్మిగనూరు వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు గోవిందురాజులు కోరారు.

ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి
మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం ఇస్తున్న సచివాలయ ఉద్యోగులు

ఎమ్మిగనూరు టౌన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్‌లో పని చేసిన వారికి స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని ఎమ్మిగనూరు వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు గోవిందురాజులు కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డికి, తహసీల్దార్‌ శేషఫణికి శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు గత 15 రోజుల కిత్రం ఇచ్చిన వినతి పత్రంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణను కర్నూలులో జరిగే మహాసభలో తెలియజేస్తామన్నారు. యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ రవి కిరణ్‌, ట్రెజరీ రజనీ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ హంపి రెడ్డి, వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:21 AM