Share News

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:41 AM

పట్టణంలోని అఖిల భారత వడ్డే ఓబన్న సేవా సమితి కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించారు.

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి
ఆత్మకూరులో చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

ఆత్మకూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అఖిల భారత వడ్డే ఓబన్న సేవా సమితి కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించారు. సమితి నాయకులు నాగరాజు, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, కృష్ణ, దరగయ్య, మల్లికార్జున, చంద్రగిరి దుర్గరాజు, పెద్దరాజు, శివ, హరికృష్ణ, సుబ్బరాజు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

మహానంది(ఆంధ్రజ్యోతి): మహానందిలోని వడ్డే వడియరాజుల సత్రంలో నిర్వాహకులు తిరుపతి వెంకటేశ్వర్లు, పల్లపు శేషగిరి రావు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు హాజరై మాట్లాడారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రఽథమంగా పోరాటం చేసిన ఉయ్యలవాడ నరసింహారెడ్డికి నిత్యం వెన్నంటి ఉంటూ సైనాధ్యక్షుడిగా బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించారని వడ్డే ఓబన్న వీర ప్రతాపాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో అందరూ కలిసి విజయంతం చేయడం అభినందనీయమని అన్నారు.

జూపాడుబంగ్లా(ఆంధ్రజ్యోతి): తరిగోపుల గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. మిఠాయిలను పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు నారాయణరెడ్డి, గిరీశ్వర రెడ్డి, మహేశ్వరరెడ్డి, యుగంధర్‌రెడ్డి, వడ్డెరసంఘం నాయకులు వెంకటేశ్వర్లు, సుంకన్న, పాపారాయుడు, బీసన్న, శేఖర్‌, రంగస్వామి, ధర్మరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:42 AM