‘ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు’
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:56 AM
పదో తరగతి పరీక్షల కోసం ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని శ్రీశైలం ఐటీడీఏ పీవో కె.వెంకట శివప్రసాద్ సూచించారు.

ఆత్మకూరు రూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల కోసం ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని శ్రీశైలం ఐటీడీఏ పీవో కె.వెంకట శివప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని బైర్లూటి గూడెంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు అభ్యసన సామగ్రి ప్యాడ్‌లు, పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులకు సులభతరమైన భోధనా సరళి ద్వారా బోధించాలని సూచించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ షేక్ ఖజా, ఉపాధ్యాయులు ఉన్నారు.