Share News

‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి’

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:07 AM

పట్టణంలో నిరుపేదలకు రెండుసెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి’
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు

నంద్యాల రూరల్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిరుపేదలకు రెండుసెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డు నుంచి అర్జిదారులతో తహశీల్దార్‌ కార్యలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌ రామసంజీవరావుకు వినతి పత్రం సమర్పించారు. నాగేశ్వరరావుతో పాటు జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి అధికారంలోకి వచ్చి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు ఆక్రమించుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాయకులు సుంకయ్య, ప్రసాద్‌, సోమన్న, లక్ష్మీదేవి, సుశీలమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 01:07 AM