Share News

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:33 PM

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి సూచించారు.

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి
దుకాణదారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ గంగిరెడ్డి

ఎమ్మిగనూరు టౌన్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం దుకాణ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలోని దీపావళికి వీవర్స్‌ కాలనీ మైదానంలో దుకాణాలు ఏర్పాటు చేసుకుం టున్న వారికి మున్సిపల్‌ కమిషనర్‌ పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్డీవో, పోలీస్‌ స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్‌ తీసుకున్న తరువాత దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆదివారం దుకాణాలు ఏర్పాటు చేసుకొని మంగళవారానికి దుకాణాలు తీసేయాలని తెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 11:33 PM