‘కేసీ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి’
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:14 AM
కేసీ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది.
నంద్యాల మున్సిపాలిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కేసీ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం సాధన సమితి సభ్యులు కేసీ కెనాల్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి మాట్లాడారు. కేసీ ఆయకట్టు పరిధిలో 70 ఎకరాల రబీ పంట సాగవుతోందని, ఏప్రిల్ 30 వరకు నీరందిస్తే తప్ప అన్నదాత మనుగడ సాగించే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కేవలం 120 రోజుల వ్యవధిలో 1562 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరినప్పటికీ నీటి సరఫరా ఎందుకు ఆపారని ప్రశ్నించారు. తక్షణమే కేసీకి నీటిని పునరుద్ధరించి ఆయకట్టు రైతాంగానికి ఆదుకోవాలని కోరారు. ధర్నా అనంతరం కేసీ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బెక్కెం చిన్న రామకృష్ణా రెడ్డి, డీవీ సుబ్బారెడ్డి, చంద్రశే ఖర్ రెడ్డి, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.