Share News

‘దళారుల దోపిడీని అరికట్టాలి’

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:11 AM

పంటల కొనుగోళ్లలో దళారుల దోపిడీని అరికట్టాలని వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి.

‘దళారుల దోపిడీని అరికట్టాలి’
నంద్యాలలో ధర్నా చేస్తున్న వివిధ సంఘాల నాయకులు

నంద్యాల రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పంటల కొనుగోళ్లలో దళారుల దోపిడీని అరికట్టాలని వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో చేపట్టారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి. రమేష్‌ కుమార్‌, ఎ. రాజశేఖర్‌, రాయలసమీ సాగునీటి సంఘం సాధన సమితి నాయకులు వైఎన్‌ రెడ్డి, రామచంద్రారెడ్డి, రైతు కూలి సంఘం జిల్లా నాయకులు ఆనంద్‌, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మార్క్‌ సుధాకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెన్న బాల వెంకట్‌లు డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ రాజకుమారికి వినతి పత్రం ఇచ్చారు.

Updated Date - Mar 06 , 2025 | 12:11 AM