Share News

వదంతులు నమ్మకండి

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:48 AM

ప్రజలను రెచ్చగొట్టే ఫేక్‌ వార్తలు, వదంతులు నమ్మొద్దని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సూచించారు.

వదంతులు నమ్మకండి
లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల మున్సిపాలిటీ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రజలను రెచ్చగొట్టే ఫేక్‌ వార్తలు, వదంతులు నమ్మొద్దని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సూచించారు. కానాల గ్రామంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను ప్రస్తుతం ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో కానాల గ్రామానికి చెందిన లబ్ధిదారులు నంద్యాలలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ మంత్రి ఫరూక్‌ను కలిశారు. మంత్రి వారితో మాట్లాడుతూ అర్హులెవరికీ అన్యాయం జరగదని, ఆందోళన చెందవద్దని సూచించారు. అర్హులకు స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మంత్రి హామీతో గ్రామస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి గురువారం పీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 15 మంది లబ్ధిదారులకు రూ. 17 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Feb 14 , 2025 | 12:48 AM