కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి: ఫిరోజ్
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:05 AM
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ అన్నారు.

నంద్యాల మున్సిపాలిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ అన్నారు. పట్టణంలోని 7,8 వార్డుల్లో గురువారం పర్యటించారు. ఫిరోజ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో వార్డులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇళ్ల మధ్యలో వర్షపు నీరు, కంప చెట్లు, వీధుల్లో దెబ్బతిన్న కరెంటు స్తంభాలు, వెలాడుతున్న కరెంటు తీగలు, వెలగని వీధి దీపాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో వార్డుల సమస్యలు స్వయంగా తెలుసుకుని సమస్యలు పరిష్కరించ డానికి ‘మన ఊరు మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల 8వ వార్డు ఉప్పరిపేటలో నూతనంగా ప్రారంభమైన సచివాలయాన్ని సందర్శించి సచివాలయ సిబ్బంది సమస్యలు ఆరా తీసారు. టీడీపీ 8వ వార్డు ఇన్‌చార్జి ఉప్పర సురేష్ కుమార్, ఉప్పరి సుబ్రిక్, మాజీ కౌన్సిలర్ రవికుమార్, గోవింద నాయుడు, పసుపులేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.