Share News

ఆదర్శప్రాయుడు దామోదరం సంజీవయ్య

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:51 AM

దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయుడు అని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

ఆదర్శప్రాయుడు దామోదరం సంజీవయ్య
నందికొట్కూరు రూరల్‌: ఎంపీడీవో కార్యాలయంలో చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయుడు అని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. సంజీవయ్య జయంతిని నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దామోదరం చిత్రపటం వద్ద ఎమ్మెల్యేతో పాటు ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ, టీడీపీ నాయకుడు మాండ్ర సురేంద్ర నాథరెడ్డి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. నిరాడంబర జీవితం గడిపిన తీరు ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను నందికొట్కూరులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ బేబి ఆధ్వర్యంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మున్సిపల్‌ డీఈ నాసీర్‌, టీపీవో రంగస్వామి, ఏఈ దినేష్‌ కుమార్‌, మెప్మా, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను పట్టణంలోని ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాలు వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి తమ్మెడపల్లి విక్టర్‌, అశోకరత్నం, మాలమహానాడు నాయకుడు రాజు, జయరాముడు, నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యం, ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌శాఖ సీఐ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల క్రైం: నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌.యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్‌బాబు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని రైతు సేవా సంఘం కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని నిర్వహించారు. ఆ సంఘం నాయకులు మునీర్‌బాషా, రహంతుల్లా, మహెబూబ్‌బాషా పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: బండిఆత్మకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో సంజీవయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండల అధ్యక్షుడు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, ఎంపీడీవో దస్తగిరి, ఈవోపీఆర్డీ రామకృష్ణవేణి, ఏవో శ్యామల, ఏపీవో వసుధ, సీనియర్‌ అసిస్టెంట్‌ చంద్రమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.

పాణ్యం: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు పాణ్యంలో నిర్వహించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాల యంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంజీవయ్య చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. నాయకుడు ప్రతాప్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు రాజు, దేవరాజు, పుల్లయ్య, శ్రీరాం, సీఐటీయూ నాయకులు నాగరాజు, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:51 AM