Share News

టీవీ మెకానిక్‌లకు సహకారం: మంత్రి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:07 AM

టీవీ మెకానిక్‌లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు.

టీవీ మెకానిక్‌లకు సహకారం: మంత్రి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల మున్సిపాలిటీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): టీవీ మెకానిక్‌లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం టీవీ మెకానిక్‌ అసోసియేషన్‌ సమావేశం అసోసియేష్‌ అధ్యక్షుడు కన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకుంటూ టీవీ మెకానిక్‌లు అభివృద్ధి చెందాలంటూ వారికి సబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ రాష్ట్ర టీవీ యూనియన్‌ ఏయూటీయూ లోగోను ఆవిష్కరించారు. నూతన సభ్యులతో కళారాధన అధ్యక్షుడు డాక్టర్‌ జి.రవికృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ ఆర్‌కే రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయపాల్‌, శివయాదవ్‌, కోశాధికారి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:07 AM