చికెన్ ప్రియులకు ఉచితంగా పకోడీ
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:30 AM
ఆత్మకూరులో చికెన్ ప్రియులకు వెన్‌కాబ్ సంస్థ వారు మంగళవారం బంఫర్ ఆఫర్ ఇచ్చారు.

ఆత్మకూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరులో చికెన్ ప్రియులకు వెన్‌కాబ్ సంస్థ వారు మంగళవారం బంఫర్ ఆఫర్ ఇచ్చారు. 200 కేజీల చికెన్ పకోడీ, 2వేల బాయిల్ ఎగ్స్‌ను ఉచితంగా అందజేశారు. కోళ్లకు వైరస్ సోకుతుండడంతో ప్రజలు చికెన్ తినడా నికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో జనం బారులు తీరారు.