Share News

వైభవంగా చండీ హోమం

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:41 AM

పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో గత 13 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఛండీ హోమాలు ఘనంగా నిర్వహించారు.

వైభవంగా చండీ హోమం
హోమంలో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దంపతులు

ఎమ్మిగనూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో గత 13 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఛండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ హోమాల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దంపతులు పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా సామూహిక హోమాల్లో పాల్గొన్నారు. హోమాల అనంతరం సీతారామచంద్రస్వామి సహస్ర కలశాభిషేకాలు నిర్వహించారు. అలాగే సాయంత్రం సీతారామాచంద్రస్వామికి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో మైదానం, యాగశాల భక్తులతో కిక్కిరిసింది. హోమాల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానందస్వామిజీ ఫల, పుష్ప, మంత్రాక్షింతలిచ్చి ఆశీర్వదించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కురువ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి, రాము, నటరాజరెడ్డి, మాచాని మహేశ్‌, మాచాని శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:42 AM