Share News

గోకులం షెడ్లతో రైతులకు ప్రయోజనం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:46 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల, పశువుల అభివృద్ధికోసం చేపట్టిన గోకులం షెడ్లతో నిర్మాణాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

 గోకులం షెడ్లతో రైతులకు ప్రయోజనం: ఎమ్మెల్యే
బొల్లవరంలో షెడ్డులోకి గోవును తీసుకొస్తున్న ఎమ్మెల్యే

నందికొట్కూరు రూరల్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల, పశువుల అభివృద్ధికోసం చేపట్టిన గోకులం షెడ్లతో నిర్మాణాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నందికొట్కూరు మండలంలోని మల్యాల, బొల్లవరం గ్రామాల్లో గోకులం షెడ్లను శనివారం ప్రాంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, పాడి పశువుల అభివృద్ధి కోసం రాయితీ కింద గోకులం షెడ్లను, పశుగ్రాసాన్ని కూడా అందిస్తోందని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీడీ అన్వరాబేగం, ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ, ఎస్‌ఐ తిరుపాలు, మాండ్ర సురేంద్రనాథ రెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ అమినాబీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మిడుతూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శనివారం మండలంలోని రోళ్లపాడు గ్రామంలో మినీ గోకులాన్ని ఆయన ప్రారంభించారు. ఎంపీడీవో దశరథరామయ్య, టీడీపీ సీనియర్‌ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ కాతా రమేష్‌ రెడ్డి, రామ స్వామి రెడ్డి, అయ్యన్న, సర్వోత్తమ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, నాగేంద్రడు, నరసింహగౌడు , ఏపీవో జయంతి, వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌(ఆంధ్రజ్యోతి): పశు సంక్షేమానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తులసిరెడ్డి అన్నారు. నంద్యాల మండలంలోని కొత్తపల్లి, పెద్దకొట్టాల గ్రామాలలో శనివారం ఎంపీడీవో సుగుణశ్రీ ఆధ్వర్యంలో గోకులాలను ప్రారంభించారు. తులసి రెడ్డి కొత్తపల్లిలో గోకులం షెడ్డును ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రైతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నారాయణ, వెంకటరమణ, ఏపీవో శ్రీకళ, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు రూరల్‌(ఆంధ్రజ్యోతి): పిన్నాపురం, పెద్దఅనంతాపురం గ్రామాల్లో గోకులం షెడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహానంది గంగాదేవి, పశుసంవర్థకశాఖ ఏడీ అరుణ, టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌రెడి,్డ సీనియర్‌ నాయకుడు రాజేంద్రారెడ్డి, ఏపీవో నాగమ్మ, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్‌, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:46 AM