Share News

యంత్రాలపై అవగాహన

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:48 PM

మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్‌ కళాశాల మెకానికల్‌ ల్యాబ్‌లలో మంగళవారం పాణ్యం కేజీబీవీ విద్యార్థినులకు యంత్రాలపై అవగాహన కల్పించారు.

యంత్రాలపై అవగాహన
యంత్రం పనితీరును పరిశీలిస్తున్న విద్యార్థినులు

పాణ్యం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్‌ కళాశాల మెకానికల్‌ ల్యాబ్‌లలో మంగళవారం పాణ్యం కేజీబీవీ విద్యార్థినులకు యంత్రాలపై అవగాహన కల్పించారు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా పదో తరగతి బాలికలు ఫీల్డ్‌ ట్రిప్‌లో భాగంగా ఆర్జీఎం కళాశాలలో మెకానికల్‌ ల్యాబ్‌లను సందర్శించినట్లు పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కళ్యాణి తెలిపారు. ల్యాబ్‌లలో బాలికలకు మెకానికల్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జయశంకర్‌, పాండురంగస్వామి బాలికలకు యంత్రాల పనితీరు, వాటి ఉపయోగం, విభాగాల పేర్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు అరుణకుమారి, ఎలిజబెత్‌, రూప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:48 PM