వైభవంగా అష్ట నాగ సహిత ఆశ్లేష బలి పూజ
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:22 AM
నంద్యాల సంజీవనగర్ రామాలయంలో మహాసుదర్శన యాగ పూర్వక అష్ట నాగ ఆశ్లేష బలి పూజా సహిత సుబ్రహ్మణ్య యాగంలో భాగంగా శనివారం సాయంకాలం 7గంటలకు భక్తి శ్రద్ధలతో విశేష అష్టనాగ పూజా సహిత ఆశ్లేష బలి పూజ నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సంజీవనగర్ రామాలయంలో మహాసుదర్శన యాగ పూర్వక అష్ట నాగ ఆశ్లేష బలి పూజా సహిత సుబ్రహ్మణ్య యాగంలో భాగంగా శనివారం సాయంకాలం 7గంటలకు భక్తి శ్రద్ధలతో విశేష అష్టనాగ పూజా సహిత ఆశ్లేష బలి పూజ నిర్వహించారు. యడవల్లి కార్తికేయ శర్మ, భగవత్ సేవా సమాజ్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.