Share News

ఆదోనికి జిల్లాగా ప్రకటించాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:20 AM

పశ్చిమ ప్రాంతాలు అభివృద్ది చేందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆదోనికి జిల్లాగా ప్రకటించాలి
ఎమ్మిగనూరులో దీక్షకు మద్దతు తెలుపుతున్న రాజీవ్‌ రెడ్డి

ఎమ్మిగనూరు టౌన్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంతాలు అభివృద్ది చేందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ గౌరవ అధ్యక్షుడు కమలే గణేష్‌, ఆదోని జిల్లా సాధన విద్యార్థి జేఏసీ నాయకులు రఘు, ఆఫ్రీది చేపట్టిన 7వ రోజు మంగళవారం రిలే నిరాహాక దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. పట్టణంలోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలు అభివృద్ది చేందాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు కదా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆదోనికి జిల్లాగా అన్ని అవకాశాలు ఉన్నాయని, ఎంతో పురాతనమైనది కూడా రైల్వే స్టేషన్‌ కూడా ఉందని, కార్యాలయాలు కూడా ఉన్నాయని, ఆదోని జిల్లా చేయాలనేదే ప్రజల ఆకాంక్షిస్తున్నారని అన్నారు. దీంతో తాము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఇక్కడ భూములు ఉన్నాయని, అయితే జిల్లా ఏర్పాటు చే యడానికి కావలసిన సౌకర్యాలు ఎమ్మిగనూరులో లేవని సమాధానం ఇచ్చారు. రిలే నిరాహార దీక్షకు వైసీపీ వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రుద్రగౌడ్‌, ఎంపీజే నాయకులు ఖాదిర్‌, మహేష్‌, పరుశురాం, ఇస్మాయిల్‌, మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు రఘు, శేఖర్‌, ఉదయ్‌, కృష్ణ, ఖాజా, ఆఫ్రీది, బతకన్న పాల్గొన్నారు.

మంత్రాలయం: వెనకబడిన ప్రాంతాల్లో అధివృద్ది చెందాలంటే ఆదోని జిల్లాగా మారాలని, ఆదోని జిల్లా చేసేందుకు పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ రామతీర్థం అమ్రేష్‌ ప్రశ్నించారు. మంగళవారం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు బీఎస్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్లో ప్రత్యేక వేదికపై ఐదవ రోజు నాయకులు బాలస్వామి, సంసోన్‌, ఆనంద్‌, ప్రసాద్‌, లక్ష్మన్న, దేవదాసు, విజేయుడు పాటు 15 మంది రిలే నిరహార దీక్షల్లో కూర్చున్నారు. కార్యక్రమంలో నాగరాజు, తిరుమలేష్‌, రమేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు థామస్‌, స్వామినాఽథం, ప్రసన్న కుమార్‌, భీమన్న, రాజు, మాలమహనాడు జిల్లా కన్వీనర్‌ ఉసేని, యోబు, ప్రభుదాస్‌, కుమార్‌, రాజు, దేవదాసు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:20 AM