Share News

Tragic Incident: ఆడుకుంటూ బియ్యం డబ్బాలోకి దూరిన బాలుడు.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - May 11 , 2025 | 02:02 PM

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన ఉలవపూడి పవన్, సరస్వతి దంపతులు స్థానిక అరుంధతీ నగర్‍లో నివాసం ఉంటున్నారు. వారికి వికాస్, వినయ్(7) అనే కవలపిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో ఖమ్మం జిల్లా మడుపల్లిలో ఉంటున్న తన అక్క వద్దకు ఇద్దరు పిల్లలను సరస్వతి పంపింది.

Tragic Incident: ఆడుకుంటూ బియ్యం డబ్బాలోకి దూరిన బాలుడు.. చివరికి ఏమైందంటే..

ఎన్టీఆర్ జిల్లా: అప్పటివరకూ తల్లిదండ్రుల కళ్లేదుటే ఆడుకున్న చిన్నారి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కనిపించకుండా పోవడంతో భార్యభర్తలిద్దరూ అల్లాడిపోయారు. బాలుడి కోసం కుటుంబసభ్యులు, బంధువులంతా వెతకసాగారు. అర్ధరాత్రి సమయంలో చిన్నారిని చూసి షాక్‌కు గురయ్యారు. ఎంతో ప్రేమగా చూసుకున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడంతో గుండెలు పగిలేలా రోధించారు.


ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన ఉలవపూడి పవన్, సరస్వతి దంపతులు స్థానిక అరుంధతీ నగర్‍లో నివాసం ఉంటున్నారు. వారికి వికాస్, వినయ్(7) అనే కవలపిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో ఖమ్మం జిల్లా మడుపల్లిలో ఉంటున్న తన అక్క వద్దకు ఇద్దరు పిల్లలను సరస్వతి పంపింది. అయితే ఆధార్ కార్డులో మార్పులు చేయాల్సి ఉండగా చిన్నారులను తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. స్థానికంగా ఉండే పిల్లలంతా కలిసి శనివారం నాడు ఆడుకోవడం మెుదలుపెట్టారు. ఈ క్రమంలోనే దొంగ, పోలీస్ ఆట ఆడారు. వినయ్ దాక్కునేందుకు తమ ఇంటిపైకి వెళ్లాడు.


అక్కడ పనుల నిమిత్తం పెట్టిన బియ్యం డబ్బాలోకి దూరి మూత వేసుకున్నాడు. అయితే డబ్బాకు ఉన్న గొళ్లెం పడిపోయి మూత ఓపెన్ కాలేదు. ఎంత సేపయినా కుమారుడు కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు బాలుడి కోసం వెతకడం మెుదలుపెట్టారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలు, స్థానికులు, బంధువుల ఇళ్లను సైతం గాలించారు. అయినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. రాత్రైన జాడ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.


అయితే అర్ధరాత్రి వేళ ఇంటిపైకి వెళ్లిన సర్వసతికి బియ్యం డబ్బా కనిపించింది. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా.. వినయ్ విగతజీవిగా కనిపించాడు. దీంతో దంపతులిద్దరూ దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. వారి బాధను చూసి స్థానికులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. బియ్యం డబ్బాలో ఇరుక్కుపోయి ఊపిరాడక బాలుడు మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Operation Sindoor: మురళీ నాయక్ పార్థీవదేహాన్ని భుజాలపై మోసిన లోకేష్..

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు

Updated Date - May 11 , 2025 | 02:04 PM