Postal Services in Krishna district: పోస్టల్ సేవలు మరింత వేగవంతం..
ABN , Publish Date - Aug 26 , 2025 | 09:33 PM
అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) 20 పోస్టల్ సేవలను మరింత సులభరం చేస్తోంది. గతంలో ఉన్న సీఎస్ఐఐ, ఎస్ఏపీ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఈ సాంకేతికత ఉద్యోగులకు పనిభారాన్ని తగ్గించి, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించనుంది.
అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) 20 పోస్టల్ సేవలను మరింత సులభరం చేస్తోంది. గతంలో ఉన్న సీఎస్ఐఐ, ఎస్ఏపీ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఈ సాంకేతికత ఉద్యోగులకు పనిభారాన్ని తగ్గించి, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించనుంది. రిజిష్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, పార్శిల్ వేగాన్ని పెంచుతుంది. అలాగే పోస్టల్ కార్యాలయాల అకౌంటులబిలిటీ, పోస్టల్ ఇన్సూరెన్స్ సేవలను విస్తృతం చేయడానికి కూడా ఉపకరిస్తోంది.
గత నెల 22వ తేదీ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని బ్రాంచి, సబ్, హెడ్ పోస్టాఫీస్లకు ఈ సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. పోస్టల్ శాఖకు ఏపీటీ సాఫ్ట్వేర్ ఓ వరమని ఉద్యోగులు, ప్రజలు భావిస్తున్నారు. గతంలో రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, పార్శిల్ అందుకునే వరకు పోస్ట్ వచ్చిందనే విషయం తెలిసేది కాదు. అయితే ఈ నూతన ఏపీటీ సాఫ్ట్‌వేర్ ఆ గీతను చెరిపేసింది. పోస్ట్ బుక్ చేసిన వెంటనే పోస్ట్ చేసే వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, అతని చిరునామా, ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారనే సమాచారంతో పాటు, పోస్ట్ ఎవరికి చేరాలి, అందుకునే వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ మొత్తం ఆన్‌లైన్‌లో రికార్డు చేశారు. దీంతో వెంటనే పోస్ట్ అందుకోవాల్సిన వ్యక్తి మొబైల్‌కు మెసేజ్ వెళుతుంది. రైలు మెయిల్ సర్వీసు ద్వారా పంపిస్తుండడంతో పార్శిల్స్ వేగంగా గమ్యానికి చేరుతున్నాయి. గుంటూరు, పశ్చి మగోదావరి జిల్లాలకు అదే రోజు పోస్ట్ చేరుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 24 గంటల లోపు పోస్ట్ చేరుతుంది. ఇతర రాష్ట్రాలకు రెండు రోజుల్లో పోస్ట్ చేరుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.
నగదు లావాదేవీలు పారదర్శకం
బ్రాంచి పోస్టాఫీసుల నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు ఆ రోజు జరిగిన లావాదేవీలను ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ సులభతరం చేసింది. మాన్యువల్ పద్ధతిలో రికార్డుల పరిశీలన బ్రాంచ్ పోస్టాఫీస్ నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు రెండు రోజులకు పైబడి కొనసాగేది. అత్యాదునిక సాంకేతికతతో ఒకే రోజులో అన్ని కార్యాలయాల అకౌంట్స్ తేలిపోతున్నాయి. ఆ రోజు ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఎంత నగదు వచ్చింది, ఎన్ని పోస్టులు చేశారనే విషయాలు ఎప్పటికప్పుడే తెలిసిపోతున్నాయి. బ్రాంచ్, సబ్ పోస్టాఫీసుల్లో జరిగే లావాదేవీలను హెడ్ పోస్టాఫీసుల్లో ఉన్నత ఉద్యోగులు నేరుగా పరిశీలిన చేసే వెలుసుబాటును ఈ సాంకేతికత సమకూర్చింది.
ఇన్సూరెన్స్ సేవలు సులభతరం
మెకామిష్ సాఫ్ట్‌వేర్ పీఎల్ఐ, ఆర్పీఎల్వీ తదితర పోస్టల్ ఇన్సూరెన్స్ సేవలతో పాటు సేవింగ్ ఖాతాల లావాదేవీలు, ఆర్డీ, టీడీ, సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్ అకౌంట్ తదితర పోస్టల్ సేవలను పరుగులు పెట్టిస్తోంది. ఖాతాదారులు క్యూలో నిలబడే అవసరం లేకుండా లావాదేవీలు చకాచకా జరిగిపోతున్నాయి. ఖాతాదారుడి వేలిముద్ర వేయగానే ఖాతాకు సంబందించిన వివరాలు వచ్చేస్తున్నాయి. దీంతో నగదు తీసుకోవడం, జమ చేయడం వంటివి వేగంగా సాగిపోతున్నాయి.
బీఎస్ఎన్ఎల్ఎతోనే తంటా
బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కారణంగా తరచూ సర్వర్ నెమ్మదిస్తోందని పోస్టల్ ఉద్యోగులు చెబుతున్నారు. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుందని, ఒక్కో సమయంలో నెట్ ఆగిపోతుందంటున్నారు. దీనికారణంగానే ప్రజలు వేచి ఉండాల్సి వస్తుందని, నెట్ సక్రమంగా పనిచేస్తే సేవలు మరింత స్పీడ్‌గా సేవలు అందిస్తామని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..
ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..