AP Legal Services Authority: ఏపీ లీగల్ సెల్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ మానవేంద్రనాథ్
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:18 PM
ఏపీ లీగల్ సెల్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ మానవేంద్రనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
అమరావతి, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం (AP Government) నియమించింది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా హైకోర్టు జడ్జి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌ను (Justice C.H. Manavendranath Roy) నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై ఏపీ హైకోర్టుకు (AP High Court) వచ్చారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత జస్టిస్ సిహెచ్ సీనియర్‌గా ఉన్నారు. ఎక్కువ సీనియారిటీ కలిగిన జడ్జిని లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించడం సాంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా మానవేంద్రనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఉన్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ మానేవంద్రనాథ్ రాయ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు.. ఎందుకంటే
తిరుమల లడ్డులో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News