Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్..!
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:46 AM
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పోలీసులు మోహరించారు.
విజయవాడ: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పోలీసులు మోహరించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత విడిచిపెట్టారని జనార్ధన్ రావు అధికారులకు తెలిపారు. జోగి రమేష్ సూచనల మేరకే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని వివరించారు.
అయితే, జోగి రమేష్ మాత్రం తనకు జనార్ధన్ రావు అనే వ్యక్తి తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. జనార్ధన రావును తానెప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అయితే జనార్ధనరావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుసుకుంది. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారాని, సీబీఐ విచారణ జరుపాలని హైకోర్టులో నిన్న(శనివారం) జోగి రమేష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం