Share News

NV Ramana Sensational Comments: నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు.. ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:31 PM

నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని ఎన్వీ రమణ తెలిపారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందన్నారు.

NV Ramana Sensational Comments: నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు.. ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్స్
NV Ramana Sensational Comments:

అమరావతి, నవంబర్ 1: విట్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (Former CJI NV Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నగరం రైతుల కష్టం, వారి త్యాగంపై నిర్మింపబడుతోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత అతి సుదీర్ఘంగా రాజధాని అమరావతి కోసం ఇక్కడి రైతులు పోరాటం చేశారని తెలిపారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని ఈ సందర్భంగా ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్స్ చేశారు.


‘ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం’ అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన కవిత్వాన్ని ఆయన ప్రస్తావించారు. ‘కృష్ణా నది నాగరికతలో సామాన్య జీవితం ఎవ్వరిది... అమరావతి నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని తనదైన శైలిలో మాజీ సీజేఐ అన్వయించారు. నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని తెలిపారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందన్నారు. చుట్టప్రక్కల గ్రామాల ప్రజల స్కూలింగ్‌కు, ఆసుపత్రులకు విట్ సహకరిస్తుందని చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం తనకు తెలుసని... అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో కృష్ణానదిలో ఉన్న దిబ్బలపై రహస్య సమావేశాలు పెట్టుకున్నామంటూ ఆనాటి సంఘటనలను ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు.


కాగా.. విట్ ఏపీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ వర్మ గౌరవ అతిథిగా, విట్ వ్యవస్థాపకులు, కులపతి జి విశ్వనాథన్ హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా చాన్సిలర్ విశ్వనాథన్‌, చీఫ్ గెస్ట్ ఎన్వీ రమణ.. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.


ఇవి కూడా చదవండి...

నేను దేశ ద్రోహినా?.. కిషన్ రెడ్డిపై మంత్రి అజారుద్దీన్ సీరియస్

పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 03:05 PM