Share News

Abdul Kalam Statue: సచివాలయంలో కలాం విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం

ABN , Publish Date - May 06 , 2025 | 03:59 PM

Abdul Kalam Statue: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

Abdul Kalam Statue: సచివాలయంలో కలాం విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం
Abdul Kalam Statue

అమరావతి, మే 6: ఏపీ సచివాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (మంగళవారం) ఆవిష్కరించారు. వైబ్రాంట్స్ ఆఫ్ కలాం సంస్థ తయారు చేసిన విగ్రహాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జూలై 27న అబ్దుల్ కలాం వర్ధంతి రోజున ఈ విగ్రహాలను ఉమ్మడి 13 జిల్లాల్లో ఆవిష్కరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 25 కలాం విగ్రహాలను ఆవిష్కరించాలని భావిస్తున్నామని ఈ సందర్భంగా వైబ్రాంట్స్ ఆఫ్ కలాం ప్రతినిధి విజయ్ తెలిపారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 20 అడుగుల అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువతకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ విగ్రహాల ఏర్పాటు ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.


దేవాదాయ శాఖపై
కాగా.. ఉదయం ఏపీ సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు .వివిధ దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలపై చర్చించారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం, ఉత్సవాల సమయంలో రద్దీ నియంత్రణ ఏర్పాట్ల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి, సింహాచలం సంఘటనలపై ఇప్పటికే అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సింహచలం ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Jupally On Miss World Event: మిస్‌ వరల్డ్ పోటీలు ఇందుకోసమే అన్న మంత్రి


ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనికి బాధ్యులు ఎవరన్న దానిపై ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సింహాచలం ఘటనా స్థలంకు వెళ్లి పరిశీలించి త్రిసభ్య కమిటీ.. మొత్తం 19 మందిని విచారించి ఈ ఘటనకు బాధ్యులెవరో తేల్చి.. మొత్తం ఆరు పేజీలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వెంటనే యాక్షన్‌లోకి దిగిన ప్రభుత్వం ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.


ఇవి కూడా చదవండి

Somireddy Vs Sajjala: సజ్జల నోరెందుకు మూగబోయిందో

Jupally On Miss World Event: మిస్‌ వరల్డ్ పోటీలు ఇందుకోసమే అన్న మంత్రి


Read Latest AP News And Telugu News

Updated Date - May 06 , 2025 | 03:59 PM