Govt Hospital Superintendents: జీజీహెచ్‌లకు సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్..సర్కార్ ఉత్తర్వులు
ABN , Publish Date - May 03 , 2025 | 02:48 PM
Govt Hospital Superintendents: రాష్ట్రంలో ఐదు జనరల్ ఆస్పత్రులకు సూపరింటెండెంట్‌లు, ఆరు మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, మే 3: రాష్ట్రంలోని పలు జనరల్ ఆస్పత్రులకు సూపరింటెండెంట్‌లు, మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్‌ను నియమిస్తూ ప్రభుత్వం (AP Govt) ఈరోజు (శనివారం) ఉత్తర్వుల జారీ చేసింది. మొత్తం ఐదు జనరల్ ఆస్పత్రులకు సూపరింటెండెంట్‌లు, ఆరు మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్ నియమితులయ్యారు. ఒంగోలు జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్, విజయవాడ జీజీహెచ్, తిరుపతి జీజీహెచ్, మచిలీపట్నం జీజీహెచ్‌లకు కొత్తగా సూపరింటెండెంట్‌ల నియామకం జరిగింది. అలాగే విశాఖ ఏఎంసీ, నెల్లూరు ఏసీపీఎస్‌ఆర్ కాలేజ్, కాకానాడ జీఎంసీ, నంద్యాల జీఎంసీ, కడప గవర్నమెంట్ కాలేజ్, స్విమ్స్ మెడికల్ కాలేజ్‌కు ప్రిపాల్స్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సూపరింటెండెంట్లు వీరే
కేవీ సుబ్రమణ్యం - ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్
అమూల్య - శ్రీకాకుళం జీజీహెచ్ సూపరింటెండెంట్
వెంకటేశ్వర రావు - విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏ.రాధ - తిరుపతి జీజీహెచ్ సూపరింటెండెంట్
వి.మన్మధరావు - మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్
AP Ration Card: రేషన్‌కార్డుదారులకు నో చింత.. గడువు పెంచిన సర్కార్

కేవీఎస్ఎం సంధ్య దేవి - విశాఖ ఏఎంసీ ప్రిన్సిపాల్
జీ రాజేశ్వరి - నెల్లూరు ఏసీఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్
ఏ విష్ణువర్ధన్ - కాకినాడ జీఎంసీ ప్రిన్సిపాల్
ఏ సురేఖ - నంద్యాల జీఎంసీ ప్రిన్సిపాల్
టి .జమున - కడప గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్
రవి ప్రభు - స్విమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
ఇవి కూడా చదవండి
Toppudurthi Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ పోలీసుల వైఫల్యం
Kasireddy SIT Custody: తొలిరోజు అలా... రెండో రోజు కసిరెడ్డి ఏం చెప్పబోతున్నారో
Read Latest AP News And Telugu News