Ambedkar Statue Fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటన.. కనిపించని పురోగతి
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:45 AM
స్థానిక సర్పంచ్ గోవిందయ్య, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. స్థానిక టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు మరికొందరు తెలుగు దేశం నేతలపై కేసు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
చిత్తూరు, అక్టోబర్ 4: జిల్లాలోని దేవలంపేట అంబేద్కర్ విగ్రహ మంటల ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ వ్యహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naid), హోం మంత్రి అనిత స్పందించి వెంటనే ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలని పోలీసు యంత్రంగానికి ఆదేశించినా ఇంకా పురోగతి కనిపించని పరిస్థితి. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. విగ్రహానికి నిప్పు పెట్టింది మీరంటే మీరే అంటూ వైసీపీ, టీడీపీ ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. స్థానిక సర్పంచ్ గోవిందయ్య, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. స్థానిక టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు మరికొందరు తెలుగు దేశం నేతలపై కేసు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
స్థానిక పంచాయతీ సెక్రెటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంటల్లో పాక్షికంగా కాలిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త కాంస్య విగ్రహాన్ని గంటల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కొత్త విగ్రహాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్,ఎస్పీ తుషార్ దూడే తో కలసి ఆవిష్కరించి, పాలాభిషేకం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యేలు వీఎం థామస్, మురళీమోహన్, దళిత సంఘాల నాయకులు.
మళ్లీ ఈరోజు దేవళంపేటలో విగ్రహం వద్ద వైసీపీ భువన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇతర ముఖ్య వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ వెలసిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇవి కూడా చదవండి..
అధికారుల దురాశ.. పల్టీ కొట్టిన క్రేన్
నేడు తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు
Read Latest Telangana News And Telugu News