Share News

Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు మార్గం సుగమం

ABN , Publish Date - May 31 , 2025 | 02:35 PM

Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు మార్గం సుగమం
Amaravati Quantum Valley

అమరావతి, మే 31: రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ( Quantum Valley Technology Park) ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఈరోజు (శనివారం) ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది.


క్యాంటం కంప్యూటింగ్ సర్వీసెస్ , సొల్యూషన్స్ తో పాటు పరిశోధన, హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను టీసీఎస్ అందించనుంది. అలాగే వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధన సహకారాన్ని అందించేలా టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. క్లైంట్ నెట్వర్క్‌తో పాటు స్టార్టప్ , ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి అమరావతి రాజధానిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది.


ఇవి కూడా చదవండి

పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 02:36 PM