Krishna Ashtami : నేడు కృష్ణాష్టమి
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:23 AM
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయాలు ముస్తాబయ్యాయి. బృందావనాల్లో చిన్ని కృష్ణులు సందడి చేయనున్నారు. నగర శివారులోని ఇస్కాన మందిరంలో శుక్రవారమే కృష్ణాష్టమి ...
అనంతపురం టౌన, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయాలు ముస్తాబయ్యాయి. బృందావనాల్లో చిన్ని కృష్ణులు సందడి చేయనున్నారు. నగర శివారులోని ఇస్కాన మందిరంలో శుక్రవారమే కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆలయ ఆవరణలో విశ్వశాంతి యజ్ఞం చేయడంతోపాటు భక్తులు హరినామ సంకీర్తనలు చేశారు. రాధా పార్థసారథులను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇటీవల కృష్ణతత్వంపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇస్కాన మందిర చైర్మన దామోదర్ గౌరంగదాస్, భక్తులు పాల్గొన్నారు.