AP Students Return: కశ్మీర్ నుంచి ఢిల్లీకి ఏపీ విద్యార్థులు
ABN , Publish Date - May 11 , 2025 | 04:47 AM
భారత, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కశ్మీర్‌లోని 41 మంది ఏపీ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విద్యార్థులకు ఏపీ భవన్‌లో వసతి, భోజన, రవాణా సదుపాయాలు అందించబడుతున్నాయి.
ఏపీ భవన్‌కు చేరుకున్న 41 మంది
న్యూఢిల్లీ, మే 10(ఆంధ్రజ్యోతి): భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కశ్మీర్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థులు తిరిగి వచ్చేస్తున్నారు. 41 మంది విద్యార్థులు శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. వీరిలో ఐదుగురు ఏపీలోని తమ స్వస్థలాలకు పయనమయ్యారు. కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరుకున్న విద్యార్థులకు ఏపీ భవన్ వసతి, భోజన, రవాణా సదుపాయాలను కల్పిస్తోంది. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని తెలుగు వారికి సాయం చేసేందుకు ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 011-23387089, 9871999430, 9871999053 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని అధికారులు సూచించారు.