Share News

CM Chandrababu: అధ్యక్షుడిగా చంద్రబాబు అరుదైన ఘనత

ABN , Publish Date - May 28 , 2025 | 09:14 AM

టీడీపీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రయాణం సాగింది. ఆ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.

CM Chandrababu: అధ్యక్షుడిగా చంద్రబాబు అరుదైన ఘనత
AP CM, TDP Chief Chandrababu

కడప, మే 28: టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. టీడీపీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మూడు దశాబ్దాల పాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. తొలిసారిగా 1995లో టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్నారు.

ఈ 30 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక 2014లో పార్టీ అధినేత చంద్రబాబు మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయన్ని గెలిపించారు. 2019లో టీడీపీ మరోసారి అధికారానికి దూరమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు.


అయితే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. దీంతో అనాటి నుంచి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూన్నారు. టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగుతోందన్న విషయం అందరికి తెలిసిందే.


వైసీపీ ప్రభుత్వంలో

మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. 2023, సెప్టెంబర్ 8వ తేదీ నంద్యాల పర్యటనలో ఉన్న ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడ తరలించారు. ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.


దాదాపు 52 రోజుల పాటు ఆయన అదే జైలులో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అలాగే వైసీపీకి చెందిన అగ్రనేతలు సైతం చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా సరే సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ సైతం ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శించకుండా.. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు సంధించారు. దీంతో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమదైన శైలిలో తీర్పు ఇచ్చారు. దాంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 09:38 AM