Share News

Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖులు

ABN , Publish Date - May 04 , 2025 | 04:33 AM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం అందుకున్నారు.

Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖులు

  • శ్రీవారి సేవలో జస్టిస్‌ వెంకటేశ్వర్లు

తిరుమల, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో.. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్‌, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ గాయనీ ఉషా ఉన్నారు. ఈమేరకు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - May 04 , 2025 | 04:37 AM