Jogi Ramesh CID Notice: జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:03 AM
మాజీ మంత్రి జోగి రమేశ్‌ను దాడి కేసులో సీఐడీ విచారణకు పిలిచింది.ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై ఏప్రిల్ 11న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో రేపు విచారణ
జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేశ్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం(11న) విచారణకు పిలిచారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రమేశ్ భారీ కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
Read Latest AP News And Telugu News